ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో వినియోగ దారులకు వాట్సాప్ ఆకట్టుకుంటోంది. తాజాగా 'ఎడిట్ మెసేజెస్' అనే ఫీచర్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకు రానున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు ఏదైనా మెసేజ్ తప్పుగా పంపితే దానిని మార్చడానికి వీలుండేది కాదు. దీంతో ఆ మెసేజ్‌ను యూజర్లు డిలీట్ చేసి, మరో మెసేజ్ పంపాల్సి వస్తోంది. తాజా ఫీచర్‌తో పంపిన మెసేజ్‌ను ఎడిట్ చేసుకునే అవకాశం వాట్సాప్ కల్పించనుంది.