అగ్నిపర్వతం బద్దలైన తర్వాత అందులోంచి వెలువడిన లావా ఉవ్వెత్తున ఎగసిపడుతూ లోతట్టు ప్రాంతాలకు ప్రవహిస్తోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అత్యంత భయానకంగా ప్రవహిస్తున్న ‘లావా’ను కొందరు దూరం నుంచి తమ కెమెరాల్లో బందించగా లావాకు కొంత దూరంలో ఇద్దరు రెస్క్యూటీమ్ సభ్యులు కూడా ఉండటం చూడొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.