ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెబల్ స్టార్ కృష్ణంరాజు కి నివాళులు అర్పించిన యరపతినేని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 19, 2022, 12:54 PM

భారతదేశం గర్వించదగ్గ నటుడు, తెలుగు చలనచిత్ర సీమలో ఒక ప్రభంజనం సృష్టించి ఏ పాత్రనైనా చెయ్యగలిగే రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి మరణం చాలా విచారకరం అని టీడీపీ నాయకులూ యరపతినేని శ్రీనివాసరావు తెలియజేసారు. కృష్ణంరాజు గారి కుటుంబ సభ్యులను హైదరాబాదులోని వారి నివాసం నందు పరామర్శకు వచ్చిన అయన మాట్లాడుతూ... ఒక మంచి మనసున్న వ్యక్తి. సినీ పరిశ్రమలో ఎవ్వరికి ఇబ్బందులు ఉన్నా ఆదుకునే వ్యక్తి. ఎటువంటి భేషజాలు లేకుండా అందరితోని కలగొలుపుగా ఉండే కృష్ణంరాజు గారు దాదాపు 50 సంవత్సరాలు చలనచిత్ర సీమలో మకుటం లేని మహారాజుగా వెలుగొందారు. పల్నాడు నేపథ్యంలో కూడా అనేక పాత్రల్లో ఆయన నటించారు. ఆయన మరణం చలనచిత్ర సీమకే కాకుండా ఆయన అభిమానులకు, తెలుగు ప్రజలందరికీ కూడా తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తావున్నాను అని ఆవేదన వ్యక్త పరిచారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com