మరికల్ మండలం జిన్నారం గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
మొత్తం 20 మందికి చెక్కులను అందజేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసి తీరుతామని, ఇప్పటికే గృహజ్యోతి గృహలక్ష్మి పథకాలను ప్రారంభించామని చెప్పారు. డిసీసీ అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.