గట్టు మండల పరిధిలోని రాయపురం గ్రామ శివారులో ఉన్న క్వారీని పంట పొలాలకు దూరంగా తరలించాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షులు ఆకేపోగు రాంబాబు శుక్రవారం డిమాండ్ చేశారు.
సల్కాపురం గ్రామానికి చెందిన క్వారీ బ్లాస్టింగ్ కారణంగా గాయపడ్డ రైతులను జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ పంట పొలాల సమీపంలో బ్లాస్టింగ్ జరపడం వల్ల పంటలకు తీవ్రమైన నష్టం జరుగుతుందన్నారు.