ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'తెలంగాణకు నెక్స్ట్ సీఎం ఆయనే.. కావాలంటే రాసి పెట్టుకోండి' .. ప్రశాంత్ కని

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 21, 2024, 07:21 PM

2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి పదేళ్లు అధికారంలో ఉన్న ఆ పార్టీ ఓటమి పాలైంది. మెుత్తం 119 అసెంబ్లీ స్థానాలకు గాను 39 స్థానాల్లో విజయం సాధించి రెండో స్థానానికి పరిమితమైంది. 64 సీట్లతో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక ఎన్నికల్లో ఓటమి తర్వాత.. బీఆర్ఎస్ పార్టీ పూర్తి డీలా పడింది. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సున్నాకే పరిమితమైంది. పార్టీ ఆవిర్భావం తర్వాత బీఆర్ఎస్‌కు లోక్‌సభలో ప్రాతినిథ్యం లేకపోవటం ఇదే తొలిసారి.


అంతకుముందు కేసీఆర్ తుంటి ఎముక విరగటం, ఆయన ఇంటికే పరిమితం కావటం, కవిత జైలుకు వెళ్లటం, దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు, ద్వితయశ్రేణి నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరటం ఆ పార్టీని తీవ్రంగా దెబ్బతీశాయి. కేడర్‌ పూర్తి నిరాశంలో కూరుకుపోయింది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లోనైనా ఆ పార్టీ పుంజుంకుంటుందా..? కేసీఆర్ మరోసారి సీఎం అవుతారా..? బీఆర్ఎస్ పార్టీ భవితవ్యం ఏంటనేది తెలంగాణ పాలిటిక్స్‌లో ఆసక్తిర చర్చ జరుగుతోంది. ఇక రెండోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా.. ? బీజేపీకి అవకాశాలు ఉన్నాయా..? అనే చర్చ కూడా నడుస్తోంది.


ఈ నేపథ్యంలో ప్రముఖ జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని 2028లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరనే దానిపై తన ప్రిడిక్షన్ ఇచ్చారు ప్రస్తుతం పొలిటికల్‌గా అనేక కష్టాలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్‌కు రానున్న రోజుల్లో మహర్దశ పట్టనుందని జోతిష్యం చెప్పారు. ఆయనకు త్వరలోనే శుభ గడియలు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. ప్రస్తుతం కేసీఆర్‌కు రాహు కాలం కొనసాగుతోందని.. త్వరలోనే ఆయనకు మంచి రోజులు వస్తాయన్నారు. ఈ మేరకు ఆయన్ ట్విట్టర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.


రాహు అంతరదశ ప్రారంభమైన సమయంలో కేసీఆర్‌ సీఎం పదవిని కోల్పోయారని చెప్పారు. ఆయన జాతకం ప్రకారం.. రాహు నుంచి కుజుడు 12వ స్థానంలో ఉన్నాడని తెలిపారు. 2024 సెప్టెంబర్‌ నుంచి గురు దశ ప్రారంభమైందని.. అక్టోబర్‌ 2026 వరకు రాజకీయంగా కేసీఆర్ డౌన్‌ఫాల్ ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అయితే 2027 జనవరిలో ఆయన రాజకీయ భవిష్యత్‌ అనూహ్య మలుపులు తిరుగుతుందని అంచనా వేశారు. 2027 జనవరి నుంచి 2029 మే వరకు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి కేసీఆర్ తన మార్క్‌ను చూపిస్తారన్నారు. 2029లో అత్యంత శుభయోగం కేసీఆర్‌కు పట్టబోతోందన్నారు. మరోసారి కేసీఆర్ కంబ్యాక్ ఇస్తారని ట్విట్టర్‌లో పోస్ట్‌లో పెట్టారు.


కాగా, ఈ ట్వీట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. మరోసారి రేవంత్ ముఖ్యమంత్రి అవుతారని కొందరు కామెంట్లు పెడుతుండగా.. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటుందని జాతకం చెప్పినా.. చెప్పకపోయినా కేసీఆర్ సీఎం అవుతారని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇక మరికొందరు ఫ్యూచర్ తెలంగాణ సీఎం కేటీఆర్ అని రాసుకురాగా.. ఈటలకు సైతం అవకాశం ఉందని తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.











SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com