నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి శ్రీనివాస్ నగర్ లో నిర్వహించిన అయ్యప్ప స్వాముల అన్న దాన కార్యక్రమానికి ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్య అతిధిగా హాజరై అయ్యప్పస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ హరిహర సుతుడైన అయ్యప్పను కొలవడం ద్వారా ఆపదలు తొలగి అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు చేకూరుతాయన్నారు. అనంతరం అయ్యప్ప మాలదారులకు ఏర్పాటుచేసిన అన్న సమారాధన కార్యక్రమానికి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ ఛైర్మన్ కోలన్ చంద్ర శేఖర్ రెడ్డి గారు ( గురుస్వామి), శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు నాగార్జున స్వామి (లాలు స్వామి) ఆలయ కమిటీ సభ్యులు ఇంద్రకుమార్ దేవ్, ఉంగరాల స్వామి, వెంకట్ రెడ్డి, దీపక్, హరి,యువ నాయకులు ఆనంద్ రెడ్డి, మాలధారణ స్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.