ప్రైవేట్ విద్యాసంస్థల్లో జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ కల్పించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పోగుల విజయ్ కుమార్, సుంక మహేష్ కోరారు. గురువారం జిల్లా కేంద్రంలో కలెక్టర్ కోయ శ్రీహర్షకు వినతి పత్రం అందజేశారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలివ్వాలని కోరారు. ఈకార్యక్రమంలో ఫణి సుదర్శన్, మారం తిరుపతిరెడ్డి, షాబీర్ పాషా, సతీష్, చంద్రమౌళి పాల్గొన్నారు.