ప్రతీ ఒక్కరు తమవంతు బాధ్యతగా రెండు మొక్కలు నాటాలని వాంకిడి సీఐ శ్రీనివాస్, ఎస్సై సాగర్ అన్నారు. గురువారం మధ్యాహ్నం వాంకిడి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణంలో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ శ్రీ డి వి శ్రీనివాస రావు ఆదేశాల మేరకు వనమహోత్సవంలో భాగంగా 60 మొక్కలు నాటారు. మొక్కలు నాటడమే కాదని, వాటిని రక్షించడం కూడా అందరి బాధ్యత అని అన్నారు. నాటిన ప్రతి మొక్క బతికేలా చూసుకోవాలని అన్నారు.