శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఆగస్ట్ 31 తేదీ వరకు ఆదిలాబాద్ జిల్లాలో 30 పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం పేర్కొన్నారు. జిల్లాలో పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టరీత్య కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లా పోలీసులకు సహకరించాలన్నారు.