శంకరపట్నం మండలం నూతన తాసిల్దార్ గా బత్తుల భాస్కర్ గురువారం పదవి బాధ్యతలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రామడుగు మండలంలో విధులు నిర్వహించిన బత్తుల భాస్కర్ సాధారణ బదిలీపై శంకరపట్నం ఎమ్మార్వోగా శంకరపట్నం మండల కార్యాలయానికి రాగా డిప్యూటీ తాసిల్దార్ బండి రమేష్ బాబు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆర్. ఐ ప్రత్యూష, కార్యాలయ సిబ్బంది ప్రీతి, భవాని, అనిల్ తదితరులు పాల్గొన్నారు.