మునిపల్లి మండలం తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాలను కలెక్టర్ వల్లూరు క్రాంతి గురువారం తనిఖీ చేశారు. విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ధర్నా చేయడంపై అక్కడి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల బోధన తీరుపై విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు బాగా చదువుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డిఓ రాజు ఉన్నారు.