ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడటంతో గురువారం జోగులాంబ గద్వాల జిల్లా మండల కేంద్రమైన మానవపాడు లో బీఆర్ఎస్ నాయకులు కిషోర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించారు. 30 ఏళ్ల పోరాటం ఫలించిందని ఆయన వ్యాఖ్యానించారు. వర్గీకరణ పోరాటంలో చాలామంది అసువులు బాసారని, ఈ విజయం అమరుల కుటుంబాలకు అంకితం అన్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.