అవినీతి ఆరోపణలు ఎదుర్కొని బదిలీపై వెళ్లిన అధికారికి తిరిగి జిల్లాలో పోస్టింగ్ ఇవ్వరాదని కోరుతూ గురువారం నారాయణపేట కలెక్టరేట్ ఏవో సుజాత కు ఎస్ఎఫ్ఐ నాయకులు వినతి పత్రం అందించారు. జిల్లా అధ్యక్షులు మోహన్ మాట్లాడుతూ, గతంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖలో జిల్లా అధికారిగా బాధ్యతలు నిర్వహించిన వేణుగోపాల్ రావు బదిలీపై వెళ్లారని, మళ్ళీ ఇక్కడికి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. నాయకులు పాల్గొన్నారు.