ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశంపై గురువారం సుప్రీంకోర్టు అత్యున్నత ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈక్రమంలో అన్ని వర్గాల నుంచి తీర్పును స్వాగతిస్తూ సంబురాలు నిర్వహించుకుంటున్నారు. వికారాబాద్ జిల్లా కోర్టులో జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తీర్పును స్వాగతించి మిఠాయిలు పంచుకొని సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో బార్అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.