తల్లి పాలతోనే బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటుందని జగిత్యాల బల్ధియా చైర్‌పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. పట్టణంలోని 8 వ వార్డులో గురువారం తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంను ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ బిడ్డ శారీరక, మానసిక వికాసానికి తల్లిపాలు దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి నరేష్, వార్డు కౌన్సిలర్ వారణాసి మల్లవ్వ తిరుమలయ్య పాల్గోన్నారు.