కామారెడ్డి పరిధిలోని అడ్లూరు 2వ వార్డులో గురువారం మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ సందర్శించారు. ఈ సందర్భంగా వన మహోత్సవంలో భాగంగా మొక్కలను నాటారు. అనంతరం ఇందుప్రియ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని చెప్పారు. ప్రతి ఇంటికి ఒకరు ఒక మొక్క నాటాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత, వార్డు కౌన్సిలర్ సుతారి రవి, అన్వర్ హైమద్, తయాబ్ సుల్తానా సలీం, పాత శివకృష్ణమూర్తి పాల్గొన్నారు.