భిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన షేక్ ఖాదీర్- సలేహా దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కూతురు షేక్ అజియా ఇంటర్ వరకు చదివింది. 2017లో అజియా అనారోగ్యానికి గురికాక ఆసుపత్రిలో చూపించగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు తేలింది. అజియాకు సర్జరీకి రూ. 30 లక్షలు అవసరమవుతుందంటూ వైద్యులు పేర్కొన్నారు. దాతలు కోసం ఆ కుటుంబం ఎదురుచూస్తుంది.