నారాయణపేట పట్టణంలోని భక్త మార్కండేయ స్వామి ఆలయ కళ్యాణమండపంలో ఆదివారం పద్మశాలి సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించినట్లు అధ్యక్షుడు క్యాథన్ రఘునాథ్ తెలిపారు. సమావేశంలో శ్రావణమాసంలో జరిగే రాఖి పండుగ ఉత్సవాలు, మద్దిలేశ్వరి అమ్మవారి జాతర ఉత్సవాలు, దేవాలయ అభివృద్ధిపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని అన్నారు. మద్దిలేటి అమ్మవారి జాతర ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. పెద్దలు పాల్గొన్నారు.