గద్వాల జిల్లా రాజోలిలో సుంకేసుల జలాశయంలో గుర్తుతెలియని మృత దేహం శవం లభ్యమైనట్టు రాజోలి ఎస్సై జగదీశ్ తెలిపారు. వివరాల ఇలా.. సుంకేసుల బ్యారేజీ దగ్గర ఉదయం మృతదేహం ఉన్నట్టుగా సమాచారం రావడంతో అక్కడికి వెళ్లి దర్యాప్తు చేపట్టామన్నారు. బ్యారేజ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడా..! లేక ఎగువ నుంచి మృతదేహం నీటి ప్రవాహానికి కొట్టుకు వచ్చిందా అనే పలు అనుమానాలతో కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు.