నడిగడ్డ ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పోరాటం చేస్తానని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలని గద్వాల పట్టణంలోని పాత బస్టాండ్ లో సోమవారం పార్టీ శ్రేణులతో కలిసి జల దీక్ష చేపట్టారు. వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేతలు గడ్డం కృష్ణారెడ్డి, నాగర్ దొడ్డి వెంకట్రాములు పాల్గొన్నారు.