ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా దానికి ప్రత్యామ్నాయంగా మరో 12 గుర్తింపు కార్డులలో ఏది చూపించైనా ఓటు వేసే అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, PAN CARD, ఇండియన్ పాస్‌పోర్టు, ఎంఎన్ఆర్డీఏ జాబ్‌కార్డు. పోస్టాఫీస్ లేదా బ్యాంక్ జారీ చేసిన ఫొటోతో ఉన్న పాస్‌బుక్. కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన హెల్త్ ఇన్సూరెన్సు కార్డ్. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు జారీ చేసిన అధికార గుర్తింపు పత్రం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ కార్డు. దివ్యాంగుల ఐడెంటిటీ కార్డు. ఆర్జీఐ జారీ చేసిన స్మార్ట్‌కార్డు. ఫొటోతో కూడిన పింఛన్ మంజూరు డాక్యుమెంట్.