గణనాధుని ఆశీస్సులతో విఘ్నాలు తొలగిపోయి ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా వర్ధిల్లాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు. సోమవారం వినాయక చవితి సందర్భంగా వికారాబాద్ పట్టణంలోని ఇందిరానగర్ లో ప్రతిష్టించిన గణనాధుని విగ్రహం వద్ద స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఆనంద్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆనందోత్సవాలతో సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ వేడుకలు జరుపుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.