మట్టి విగ్రహాలనే ప్రతిష్టించి పూజించాలని అప్పుడే పర్యావరణాన్ని పరిరక్షించిన వారమవుతామని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. వినాయక చవితి సంధర్భంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోని మట్టి వినాయకుడిని ప్రతిష్టాపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న దంపతులు సోమవారం రాత్రి వినాయకునికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజాది కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.