వనపర్తి జిల్లా పరిధిలోని బెంగళూర్ హైవే 44 పై ఘోరప్రమాదం జరిగింది. కడుకుంట్ల స్టేజీ వద్ద మంగళవారం తెల్లవారుజామున కర్నూలు నుంచి హైదరాబాద్ వైపునకు వెళ్తున్న బొలేరో వాహనం. డ్రైవర్ నిద్రమత్తులో కడుకుంట్ల స్టేజీ వద్ద రేలింగ్తో పాటు బస్టాండ్ పిల్లర్‌ను అతివేగంగా ఢీకొట్టింది. వాహనం రోడ్డు పక్కకు ఒరిగిపోయింది. గాయపడిన డ్రైవర్, మరొకరిని వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు.