ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అందరి సహకారంతో మహబూబ్ నగర్ అభివృద్ధికి కృషి: జిల్లా కలెక్టర్ రవి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 01, 2023, 07:52 PM

ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది ప్రజలందరి సహకారంతో మహబూబ్ నగర్ జిల్లాను ప్రగతి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని నూతన జిల్లా కలెక్టర్ జి. రవి తెలిపారు. బుధవారం అయన మహబూబ్ నగర్ జిల్లా నూతన కలెక్టర్ గా పదవీ బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా నూతన జిల్లా కలెక్టర్ జి. రవి మాట్లాడుతూ గతంలో తనకున్న అనుభవంతో ప్రభుత్వ ప్రాధామ్య పథకాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు కృషి చేస్తానని, అందరి సహకారంతో జిల్లాను ముందుకు నడిపిస్తానని తెలిపారు. తాను మహబూబ్ నగర్ జిల్లాకు కొత్త అయినప్పటికీ, త్వరలోనే జిల్లా గురించి పూర్తిగా తెలుసుకొని గతంలో పనిచేసిన జిల్లా కలెక్టర్ల మాదిరిగానే అధికారులు , సిబ్బంది ప్రజా ప్రతినిధుల సహకారం, సమన్వయంతో జిల్లాను ముందుకు నడిపించేందుకు కృషి చేస్తానన్నారు. మహబూబ్ నగర్ లాంటి జిల్లాలో పనిచేసేందుకు అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి , రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ లకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా మహబూబ్ నగర్ జిల్లా నూతన కలెక్టర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన జి. రవి, ఐ ఏ ఎస్ (2015 ) స్వస్థలం మహబూబాబాద్ జిల్లా, మరిపెడ మండలం, ధర్మారం గ్రామం. వరంగల్ లోని సెయింట్ పీటర్స్ పాఠశాలలో ఎల్ కె జి నుండి 5వ తరగతి వరకు చదివారు. ఆరవ తరగతి నుండి ఇంటర్ వరకు కోరుకొండ సైనిక్ స్కూల్లో విద్యాభ్యాసం చేశారు. వరంగల్ ఆర్ ఈసి కళాశాలలో బీటెక్ పూర్తి చేసి, ఏపీ జెన్కోలో ఇంజనీర్ గా పనిచేశారు. అనంతరం గ్రూప్-1 ద్వారా ఎంపికై 2008 లో నల్గొండ జిల్లాలో శిక్షణ పొందిన తర్వాత పాల్వంచ, అదిలాబాద్, దేవరకొండ ఆర్డిఓ గా పనిచేశారు. అనంతరం నల్గొండ డిఆర్ఓగా పనిచేశారు. జిల్లాల విభజన తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లా జాయింట్ కలెక్టర్ గా, హైదరాబాద్ జాయింట్ కలెక్టర్ గా పని చేస్తూనే హైద్రాబాద్ ఇన్చార్జి జిల్లా కలెక్టర్ గా కూడా పనిచేశారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ గా మూడు సంవత్సరాలు పని చేసిన తర్వాత మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ గా బుధవారం ఆయన పదవి బాధ్యతలను చేపట్టారు. మహబూబ్ నగర్ జిల్లా నూతన కలెక్టర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ జి. రవికి రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, పలువురు జిల్లా అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు జిల్లా కలెక్టర్ ను కలిసి పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com