మిర్యాలగూడ నూతన డీఎస్పీ గా పనకంటి వెంకట గిరి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. 1995లో సిటీ పోలీస్ విభాగంలో ఎస్సై గా విధుల్లో చేరి 2009 లో సీఐ గా పదోన్నతి పొందారు. పదేళ్లకు పైగా ఇంటలిజెన్స్ విభాగంలో పని చేస్తూ 2019లో డీఎస్పీగా ప్రమోషన్ పొందినట్లు తెలిపారు. సాధారణ బదిలీల్లో భాగంగా మిర్యాలగూడ డీఎస్పీ గా చేరినట్లు పేర్కొన్న ఆయన ప్రజల రక్షణ పోలీసుల విధి అని చట్టం పరిధిలో తాను పని చేస్తానని పేర్కొన్నారు. చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.