హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ కష్టాలకు తెరదించేందుకు GHMC కొత్త ఫ్లైఓవర్‌ను అందుబాటులోకి తెచ్చింది. గచ్చిబౌలి ORR నుంచి శిల్పా లేఅవుట్ వరకు ₹.190 కోట్లతో చేపట్టిన నాలుగు వరుసల ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయింది. 823 మీటర్ల పొడవు, 16.60 మీటర్ల వెడల్పుతో నిర్మితమైన ఇది పొడవైన పైవంతెనల్లో ఒకటిగా నిలవనుంది. అద్దాల, భారీ భవంతుల నడుమ ఈ వంతెన కొత్త అందాలను సంతరించుకుంది. దీన్ని శుక్రవారం తెలంగాణ మంత్రి KTR చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.
![]() |
![]() |