ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం తీరుపై మండిపడుతున్న జంతు ప్రేమికులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 07, 2022, 07:37 PM

దసరా ఉత్సవాల్లో భాగంగా చేపట్టిన కార్యక్రమాలతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వివాదంలో చిక్కుకున్నారు. దసరా పర్వదినాన పాలపిట్టను చూస్తే మంచి జరుగుతుందనే నమ్మకం తెలంగాణలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, పండుగ రోజున చూసేందుకు ప్రగతి భవన్ కు పాలపిట్టను ముఖ్యమంత్రి తెప్పించుకున్నారు. సీఎం కోసం అధికారులు పాలపిట్టను పంజరంలో బంధించి తీసుకొచ్చారు. ఇప్పుడు దీనిపైనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం పాలపిట్టను బంధించడం నేరం. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారు శిక్షార్హులు అవుతారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com