ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నియోజకవర్గ ఇన్ఛార్జ్ లను నియమించిన కమలం పార్టీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 07, 2022, 07:35 PM

రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజవర్గాలకు ఇన్ఛార్జ్ లను  బీజేపీ రాష్ట్ర శాఖ నియమించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఆస‌న్న‌మ‌వుతోంది. క్రితం సారి నిర్ణీత స‌మ‌యానికి 6 నెల‌లు ముందుగా తెలంగాణ అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌రిగిన సంగతి తెలిసిందే. ఫ‌లితంగా ప్ర‌స్తుత స‌భ‌కు వచ్చే ఏడాది డిసెంబ‌ర్ నాటికే గ‌డువు ముగియ‌నుంది. ప్ర‌తి ఐదేళ్ల‌కోమారు ఎన్నిక‌లు జ‌ర‌గాల‌న్న నిబంధ‌న మేర‌కు వ‌చ్చే ఏడాది డిసెంబ‌ర్‌లోగానే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. ఈ మేర‌కు అధికార టీఆర్ఎస్‌తో పాటు విప‌క్షాలు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. 


రెండు వ‌రుస ఉప ఎన్నికల్లో గ్రాండ్ విక్ట‌రీతో రెట్టించిన ఉత్సాహంతో సాగుతున్న బీజేపీ ఈ ద‌ఫా తెలంగాణ‌లో అధికార ప‌గ్గాలు ద‌క్కేది త‌మ‌కేనన్న ధీమాతో ఉంది. అదే భావ‌న‌తో సాగుతున్న బీజేపీ రాష్ట్ర శాఖ శుక్ర‌వారం ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇంచార్జీలను నియ‌మిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పూర్తి స్థాయి జాబితా విడుద‌ల చేశారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com