ఘనంగా ముగిసిన గండిమైసమ్మ విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలుసంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణం శాస్త్రి నగర్ లో నూతనంగా నిర్మించిన గడి మైసమ్మ ఆలయం విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలు ఘనంగా ముగిసాయి. స్థానిక కాలనీవాసుల ఆధ్వర్యంలో గత మూడు రోజుల పాటు విశేష పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో కొనసాగించారు. కాలనీ ఆరాధ్య దైవమైన గడి మైసమ్మ కు పెద్ద ఎత్తున కానుకలు ఇచ్చి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవ కార్యక్రమానికి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పట్టణ ప్రజలు పాల్గొని పూజలు చేశారు.
![]() |
![]() |