ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిచ్చగాడా మజాకా!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 12, 2017, 01:02 AM

ప్రముఖ దర్శకులు కె.ఎస్‌.నాగేశ్వర రావు దర్శకత్వంలో.. ఆల్‌ వెరైటీ మూవీ మేకర్‌‌స పతాకంపై నూతన నిర్మాత  బి.చంద్రశేఖర్‌ నిర్మిస్తున్న విభిన్న కథాచిత్రం బిచ్చగాడా మజాకా... అర్జున్‌-నేహాదేశ్‌ పాండే జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో.. సుమన్‌, బాబూమోహన్‌, బాలాజీ, రామసత్యనారాయణ, గౌతంరాజు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నిర్మాత బి.చంద్రశేఖర్‌ ఈ చిత్రానికి కథ మరియు సంభాషణలు అందించడం విశేషం.


మూడు పాటలు, రెండు ఫైట్‌‌స మినహా షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం టైటిల్‌ అనౌన్‌‌స చేసేందుకు ఫిలిం ఛాంబర్‌ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో.. చిత్ర నిర్మాత బి.చంద్రశేఖర్‌, దర్శకులు కే.ఎస్‌.నాగేశ్వరరావు, హీరో అర్జున్‌, హీరోయిన్‌ నేహాదేశ్‌ పాండే, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌‌స ఎస్‌.కే.రహమాన్‌, ఎస్‌.ఎం.భాషా, కెమెరామెన్‌ అడుసుమిల్లి విజయ్‌ కుమార్‌, ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించిన బాలాజీ, గౌతంరాజు పాల్గొన్నారు.


బిచ్చగాడా మజాకా చిత్రం ద్వారా ఓ మంచి నిర్మాతను పరిశ్రమకు పరిచయం చేస్తున్నందుకు గర్వంగా ఉందని చిత్ర దర్శకులు కే.ఎస్‌.నాగేశ్వరరావు పేర్కొనగా.. తాను తయారు చేసుకున్న కథను కే.ఎస్‌.నాగేశ్వరరావు అద్భుతంగా తెరకెక్కించారని.. అడుసుమిల్లి విజయ్‌ కుమార్‌ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ముఖ్య ఆకర్షణ అని.. మే లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత బి.చంద్రశేఖర్‌ అన్నారు. బిచ్చగాడా మజాకా వంటి మంచి చిత్రంలో నటించే అవకాశం రావడం  అదౄఎష్టంగా భావిస్తున్నామని హీరోహీరోయిన్‌‌స అర్జున్‌, నేహాదేశ్‌ పాండే చెప్పారు. ఈ సినిమాలో తాము చాలా మంచి పాత్రలు పోషించామని బాలాజీ, గౌతంరాజు తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com