ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫోటో మూమెంట్ : ఒక ఫ్రేమ్‌లో 'తంగలన్' స్టార్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jul 24, 2024, 04:07 PM

దర్శకుడు పా రంజిత్‌తో స్టార్ హీరో  విక్రమ్ తంగలన్ సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమాపై ప్రేక్షకులకి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఆగష్టు 15, 2024న విడుదల కానుంది. ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా యొక్క ప్రమోషనల్ ఈవెంట్‌లో స్టార్ తమిళ కంపోజర్ జివి ప్రకాష్ కుమార్, హీరో చియాన్ విక్రమ్, నటీమణులు పార్వతి తిరువోతు మరియు మాళవిక మోహనన్, దర్శకుడు పా రంజిత్ మరియు స్టూడియో గ్రీన్ నిర్మాత జ్ఞానవేల్ రాజా ఒక ఫోటోని తీసుకున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్ మరియు పార్వతి తిరువోతు కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో డేనియల్ కాల్టాగిరోన్, పశుపతి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు. నీలం ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com