ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'సూర్య44' ప్రోమోకి సాలిడ్ రెస్పాన్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jul 24, 2024, 03:32 PM

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన తదుపరి ప్రాజెక్ట్ ని కార్తీక్ సుబ్బరాజ్‌తో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి లవ్ లాఫ్టర్ వార్ అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమాలో సూర్యకి జోడిగా సిజ్లింగ్ బ్యూటీ పూజా హెడ్గే నటిస్తుంది. ఇటీవలే మూవీ మేకర్స్ సూర్య పుట్టినరోజు సందర్భంగా సూర్య44 నుండి ఒక ప్రత్యేక గ్లింప్సె ని ఆవిష్కరించారు. తాజాగా ఇప్పుడు ఈ ప్రోమో 20 గంటలలో 65 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్నట్లు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఈ సినిమాలో జయ రామ్, కరుణాకరన్, జోజు జార్జ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకి సంతోష్ నారాయణ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టోన్ బెంచ్ నిర్మిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com