ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఆయ్' థీమ్ సాంగ్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Sat, Jul 20, 2024, 03:32 PM

టాలీవుడ్ యంగ్ హీరో నార్నే నితిన్ కొత్త దర్శకుడు అంజి కంచిపల్లితో తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'ఆయ్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా థీమ్ సాంగ్ ని విడుదల చేసారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ సినిమాలో నయన్ సారిక కథానాయికగా నటించింది. ఈ సినిమాలో అంకిత్ కొయ్య, రాజ్ కుమార్ కసిరెడ్డి కీలక పాత్రలలో నటిస్తున్నారు. రామ్ మిరియాల ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా, సమీర్ కళ్యాణి సినిమాటోగ్రఫీని నిర్వహించారు. GA2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆగష్టు 15న విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com