ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దర్శకుడు సందీప్ రెడ్డి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'జనక అయితే గనక' టీమ్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 19, 2024, 03:50 PM

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ తన తదుపరి ప్రాజెక్ట్ ని సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'జనక అయితే గనక' (జాగ్) అని టైటిల్ ని లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మూవీ టీమ్ ఒక స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో సంగీత విపిన్ మహిళా కథానాయికగా నటించింది. ఈ ప్రాజెక్ట్‌కి సంగీతం విజయ్ బుల్గానిన్ అందించారు. బలగం ప్రొడక్షన్స్‌పై హన్షితారెడ్డి, హర్షిత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com