ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఆయ్' థీమ్ సాంగ్ విడుదలకి టైమ్ లాక్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 19, 2024, 02:55 PM

టాలీవుడ్ యంగ్ హీరో నార్నే నితిన్ కొత్త దర్శకుడు అంజి కంచిపల్లితో తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి ఆయ్ అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా థీమ్ సాంగ్ ని ఈరోజు మధ్యాహ్నం 4 గంటలకి హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాలో నయన్ సారిక కథానాయికగా నటించింది. రామ్ మిరియాల ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా, సమీర్ కళ్యాణి సినిమాటోగ్రఫీని నిర్వహించారు. GA2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆగష్టు 15న విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com