ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓపెన్ అయ్యిన 'ఫ్యామిలీ స్టార్' టికెట్ బుకింగ్స్

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 01, 2024, 02:42 PM

పరశురామ్ పెట్ల దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఒక ప్రాజెక్ట్ ని చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి "ఫ్యామిలీ స్టార్" అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా ఏప్రిల్ 5, 2024న విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా టికెట్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం ఆన్లైన్ లో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో రష్మిక మందన్న అతిధి పాత్రలో నటించగా, దివ్యాంశ కౌశిక్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది. దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీత దర్శకుడు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com