ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైరల్ అవుతన్న రష్మిక లుక్

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 20, 2024, 12:49 PM

‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్‌చరణ్‌ ఓ ప్రాజెక్ట్‌ ఓకే చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. ప్రముఖ దర్శకుడు శంకర్‌, సుకుమార్‌, చిరంజీవి, అల్లు అరవింద్‌, బోనీకపూర్‌తోపాటు పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొని చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. పూజా కార్యక్రమం అనంతరం రామ్‌చరణ్‌ మాట్లాడుతూ.. అతిథులకు కృతజ్ఞతలు తెలిపారు.
 ఈ సినిమాలోని షూటింగ్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా షూటింగ్ సెట్‌లో ఉన్న హీరోయిన్ రష్మిక లుక్ లీకైంది. శ్రీవల్లి పాత్రలో నటిస్తున్న రష్మిక.. ఎరుపురంగు చీరలో బంగారు ఆభరణాలు ధరించి కనిపించారు. ఆగస్టు 15న ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com