ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాశీఖన్నా అందాల విందు

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 20, 2024, 11:51 AM

రాశీఖన్నా ఇటీవల గ్లామర్‌ విషయంలో డోస్‌ పెంచింది. అందాల ఆరబోతకి గేట్లు ఎత్తేస్తూ షాకిస్తుంది. నెటిజన్లకి తన అందాలను సరికొత్తగా ఆవిష్కరిస్తూ రచ్చ చేస్తుంది. మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించిన రాశీఖన్నా `ఊహలు గుసగుసలాడే` సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ వెంటనే బిజీ హీరోయిన్‌ అయిపోయింది. తొలి సినిమా హిట్‌ కావడంతో రాశీఖన్నాకి వరుసగా సినిమా ఆఫర్లు క్యూ కట్టాయి. ఇలా యంగ్‌ హీరోలతో కలిసి నటించే అవకాశాలు వచ్చాయి. నెమ్మదిగా స్టార్‌ హీరోల సరసన నటించే ఆఫర్లని సొంతం చేసుకుంది. ఢిల్లీకి చెందిన ఈ బ్యూటీ `జోరు`, `జిల్‌`, `శివం`, `బెంగాల్‌ టైగర్‌`, `సుప్రీమ్‌`, `హైపర్‌`, `జై లవ కుశ` చిత్రాలు చేసింది. ఇందులో `జోరు`, `శివమ్‌` చిత్రాలు తప్ప మిగిలిన మూవీస్‌ అన్నీ విజయాలను అందుకున్నాయి. దీంతో ఈ బ్యూటీకి ఇతర భాషల్లోనూ ఆఫర్లు వచ్చాయి. దీంతో అటువైపు ఫోకస్‌ పెట్టింది. కెరీర్‌ ట్రాక్‌ తప్పింది. తమిళంలోనూ సినిమా ఆఫర్లు వచ్చాయి. కానీ సక్సెస్‌ రాలేదు. 


 `ఆక్సీజన్‌`, `టచ్‌ చేసి చూడు` మూవీస్‌ డిజాస్టర్‌ అయ్యాయి. ఈ క్రమంలో వరుణ్‌ తేజ్‌తో కలిసి చేసిన `తొలి ప్రేమ` రిలీఫ్‌నిచ్చింది. ఈ సరికొత్త లవ్‌ స్టోరీ హిట్‌ కావడంతో కెరీర్‌ పరంగా రాశీఖన్నా గాడిలో పడినట్టయ్యింది. ఆ తర్వాత ఈ బ్యూటీ నటించిన ఒక్క హిట్‌ కూడా పడలేదు. తెలుగు, తమిళంలో సినిమాలు చేసింది. ఒక్క `అరణ్మనై` మూవీ తప్ప మిగిలినవి అన్నీ బోల్తా కొట్టాయి. దీంతో రాశీ కెరీర్‌ ఒక్కసారిగా డౌన్‌ అయ్యింది. 


 గతేడాది `పక్కా కమర్షియల్‌` సినిమాలో నటించి పరాజయం చవిచూసింది. తమిళంలోనూ ఆమె సినిమాలు ఆడలేదు. ఇటీవల `యోధ` మూవీతో వచ్చింది. దీనికి నెగటివ్‌ టాక్‌ వచ్చింది. ప్రస్తుతం తెలుగులో `తెలుసు కదా` అనే మూవీలో నటిస్తుంది. తమిళంలో అరణ్మనై 4`, `మేథావి`తోపాటు హిందీలో `ది రబర్మట్టి రిపోర్ట్`, `టీఎంఈ` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అయితే తెలుగులో ఈ బ్యూటీకి ఆఫర్లు లేవు.


 అయితే ఇప్పుడు తెలుగులో సినిమా ఆఫర్లని అందుకునేందుకు ప్రయత్నిస్తుంది. మంచి ఆఫర్ల కోసం వెయిట్‌ చేస్తుంది. ఈ క్రమంలో అందాల విందు చేస్తుంది రాశీఖన్నా. రాశీఖన్నా ఇటీవల గ్లామర్‌ విషయంలో డోస్‌ పెంచింది. అందాల ఆరబోతకి గేట్లు ఎత్తేస్తూ షాకిస్తుంది. నెటిజన్లకి తన అందాలను సరికొత్తగా ఆవిష్కరిస్తూ రచ్చ చేస్తుంది. లేటెస్ట్ గా ఆమె ఫోటో షూట్‌ మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. కళ్లు జిగేల్‌ మనేలా చేస్తుంది. క్లీవేజ్‌ షో చేస్తూ ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. దీంతో ప్రస్తుతం ఈ బ్యూటీ పిక్స్ సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తున్నాయి. 


 


 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com