ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'సరిపోదా శనివారం’ నుండి ఫస్ట్‌ గ్లింప్స్‌ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 24, 2024, 01:52 PM

నాని హీరోగా నటిస్తున్న చిత్రం 'సరిపోదా శనివారం’. వివేక్‌ ఆత్రేయ దర్శకుడు. డి.వి.వి.ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్నారు. శనివారం నాని పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌ గ్లింప్స్‌ను విడుదల చేశారు. నానికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ నిర్మాణ సంస్థ సమవర్తి.. సమవర్తి అంటూ ఇందులో నాని సూర్య అనే పాత్రలో నటిస్తున్నాడు."కోపాలు రకరకాలు. ఒక్కో మనిషిలో ఒక్కోలా ఉంటుంది. కానీ ఆ కోపాన్ని క్రమబద్ధంగా, ఓ పద్దతిగా వారంలో ఒక్కరోజు మాత్రమే చూపించే పిచ్చి నా కొడుకుని చూశారా? నేను చూశా... పేరు సూర్య... రోజు శనివారం’’ అంటే హీరో పాత్రను ప్రతినాయక పాత్ర పోషిస్తున్న ఎస్‌.జె.సూర్య పరిచయం చేశారు. గ్లింప్స్‌లో హీరో ఇంట్రడక్షన్  ఇచ్చిన తీరు బావుంది. నాని మాస్‌ లుక్‌లో ఆకట్టుకుంటున్నారు. ప్రియాంక ఆరుళ్‌ మోహన కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి జేక్స్‌ బిజాయ్‌ సంగీతం అందిస్తున్నారు. చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com