ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఊరి పేరు భైరవకోన' లో రాజప్ప గా రవిశంకర్‌

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 09, 2024, 02:20 PM

వీఐ ఆనంద్ దర్శకత్వంలో యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో సందీప్ కిషన్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ మిస్టరీ థ్రిల్లర్ కి 'ఊరి పేరు భైరవకోన' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఊరు పేరు భైరవకోన మూవీ ఫిబ్రవరి 16, 2024న విడుదల కానుంది. తాజాగా ఇప్పుడు ఈ ఫాంటసీ డ్రామాలో రవిశంకర్‌ రాజప్ప అనే క్యారెక్టర్ లో నటిస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ నటుడి యొక్క క్యారెక్టర్ పోస్టర్ ని విడుదల చేసారు.

ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ కథానాయికగా నటిస్తుంది. కావ్య థాపర్, హర్ష చెముడు, రాజశేఖర్ అనింగి, వెన్నెల కిషోర్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రతిష్టాత్మకంగా సమర్పణలో హాస్య మూవీస్‌ బ్యానర్‌పై రాజేష్‌ దండా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com