ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'పిండం'

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 02, 2024, 02:22 PM

శ్రీరామ్, ఖుషీ రవి ప్రధాన పాత్రలలో నటించిన పిండం అనే హారర్ చిత్రం యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఆహా వీడియో సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. కొత్త దర్శకుడు సాయికిరణ్ దైదా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ది స్కేరిస్ట్ ఫిల్మ్ అనేది ట్యాగ్ లైన్.  తాజాగా డిజిటల్ ప్లాట్ఫారం ఈ మిస్టీరియస్ హారర్ డ్రామా ఫిబ్రవరి 2, 2024న డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచినట్లై అధికారకంగా ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు డిజిటల్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.

ఈ చిత్రంలో ఈశ్వరి రావు, అవసరాల శ్రీనివాస్, రవి వర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాయికిరణ్ దైదా, కవి సిద్దార్థ కథను అందించగా, సతీష్ మనోహరన్ సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు. ఈ సినిమాకి కృష్ణ సౌరభ్ సూరంపల్లి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com