ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రోకబడ్డీలీగ్‌ కి హాజరుకానున్న 'ఈగల్' టీమ్

cinema |  Suryaa Desk  | Published : Sun, Jan 21, 2024, 10:21 AM

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ సినిమాటోగ్రాఫర్ నుండి దర్శకుడిగా మారిన కార్తీక్ ఘట్టమ్నేనితో తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ యాక్షన్ థ్రిల్లర్ కి 'ఈగిల్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా ఫిబ్రవరి 9, 2024న తెలుగు మరియు హిందీలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. తాజాగా ఈరోజు ప్రోకబడ్డీలీగ్‌ కి ఈగల్ టీమ్ హాజరుకానుంది. స్టార్ స్పోర్ట్స్ మరియు డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో లైవ్ రానుంది.

థ్రిల్లర్‌ ట్రాక్ లో రానున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో కావ్య థాపర్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com