ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జెడి చక్రవర్తికి ఉత్తమ నటుడు అవార్డ్.. అందించిన 'ఓటీటీ ప్లే'

cinema |  Suryaa Desk  | Published : Fri, Nov 03, 2023, 12:43 PM

జేడీ చక్రవర్తి ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. తెలుగులో ఎన్నో హిట్ సినిమాలు చేశారు జేడీ. కొంత కాలం పాటు సినిమాలకు విరామం ఇచ్చినా ఇప్పుడు సినిమాలతో పాటు వెబ్ సిరీసుల్లో కూడా నటిస్తూ బిజీ అయ్యారు. తాజాగా ఆయన నటించిన 'దయా' వెబ్ సిరీస్ విజయం సాధించింది. ఈ చిత్రంలో నటనకు గాను ఆయనకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది. 'ఓటీటీ ప్లే' అనే సంస్థ ఈ అవార్డును అందించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com