ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చీరకట్టులో మెహ్రీన్

cinema |  Suryaa Desk  | Published : Thu, Oct 26, 2023, 11:27 AM

‘ఎఫ్2’ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా చీరకట్టులో మెరిసి కట్టిపడేస్తోంది. బ్యూటీఫుల్ శారీలో నైట్ ఫొటోషూట్ తో ఆకట్టుకుంది. ఈ ముద్దుగుమ్మ తాజా ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. యంగ్ అండ్ బ్యూటీఫుల్ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా   కెరీర్ టాలీవుడ్ తోనే ప్రారంభమైంది. ఆమె తొలిచిత్రం ‘కృష్ణ గాడి వీరప్రేమగాధ’. నాని సరసన మెప్పించింది. తన అందంతోనూ మొదటి సినిమాకే ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. తెలుగులో క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటించి అలరించింది.‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్2’, ‘ఎఫ్3’ వంటి చిత్రాలు ఈ ముద్దుగుమ్మకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. తెలుగు, తమిళంలో మెహ్రీన్ వరుస చిత్రాలు చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లోనూ సందడి చేస్తోంది. రీసెంట్ గా ఈ బ్యూటీ నటించిన ‘సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ’ సిరీస్ ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం మరిన్ని చిత్రాల్లోనూ నటిస్తోంది. ఈ క్రమంలో తన సినిమాలను ప్రమోట్ చేసుకునేందుకు మెహ్రీన్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తోంది. ఈసందర్భంగా బ్యూటీఫుల్ లుక్స్ లో మెరుస్తూ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది. తన అందంతో నెటిజన్లనూ మంత్రముగ్దులను చేస్తూ మరింత క్రేజ్ దక్కించుకుంటోంది. తాజాగా మెహ్రీన్ చీరకట్టులో దర్శనమిచ్చింది. బ్యూటీఫుల్ శారీలో మరింత అందాన్ని సొంతం చేసుకుంది. చీరలో నైట్ ఫొటోషూట్ చేసి అదరగొట్టింది. బ్యూటీఫుల్ ఫోజులతో కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. మెరిసిపోయే చర్మసౌందర్యంతో మంత్రముగ్ధులను చేసింది. 


 


 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com