ట్రెండింగ్
Epaper    English    தமிழ்

USAలో 'దసరా' రిలీజ్ కి భారీ ప్లాన్

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 18, 2023, 07:14 PM

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని "దసరా" సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ జోడిగా నటిస్తుంది. ఈ పాన్ ఇండియన్ సినిమా ట్రైలర్‌ ఇతర భాషలలో కూడా మంచి బజ్ ని సంపాదించింది. ఈ మాస్-యాక్షన్ చిత్రం USA ప్రాంతంలో ఒక్క తెలుగు వెర్షన్ మాత్రమే 600కి పైగా లొకేషన్లలో తెరకెక్కనుంది అని సమాచారం.

యాక్షన్ డ్రామా ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాలో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమా మార్చి 30, 2023న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com