ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ జయంతి నేడు..!!

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 17, 2023, 02:29 PM

కన్నడ కంఠీరవ శ్రీ డా. రాజ్ కుమార్ గారి చిన్న కొడుకుగా సినీ రంగ ప్రవేశం చేసి, అశేష ప్రేక్షకాభిమానులను సంపాదించుకుని, 46 ఏళ్ళ చిన్న వయసులోనే అనంతలోకాలకు పయనమైన కన్నడ పవర్ స్టార్, అభిమానులు ప్రేమగా పిలుచుకునే అప్పు.. పునీత్ రాజ్ కుమార్ గారి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా అశేష ప్రేక్షకగణం ఆ మహనీయుడిని గుర్తు చేసుకుంటున్నారు.


పునీత్ కేవలం నటుడు మాత్రమే కాదు.. ఫిలాంత్రపిస్ట్, సింగర్, వ్యాఖ్యాత, నిర్మాత కూడా. చైల్డ్ ఆర్టిస్ట్ గా నేషనల్ అవార్డు అందుకున్నారు పునీత్. 2002లో వచ్చిన 'అప్పు' సినిమాతో లీడ్ హీరోగా కన్నడ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పునీత్, మూడు దశాబ్దాల సినీజీవితంలో ఒక నేషనల్ అవార్డు, 4 కర్ణాటక రాష్ట్ర అవార్డులు, 6 ఫిలింఫేర్ అవార్డులు, 5 సైమా అవార్డులు, ఇంకా కర్ణాటక రత్న అవార్డును కూడా అందుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com