ఈ నెల 22న విడుదల కాబోతున్న హీరో విశ్వక్ సేన్ కొత్త సినిమా తెలుగుతో పాటు హిందీలో కూడా అదే రోజు విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఐతే, ఇటీవలే ధమ్కీ ట్రైలర్ 2.O తెలుగులో విడుదలై, అమేజింగ్ రెస్పాన్స్ అందుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం జరగబోతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో, చీఫ్ గెస్ట్ గా పాల్గొనబోతున్న మాస్ అమ్మ మొగుడు జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా హిందీ ట్రైలర్ విడుదల కాబోతుందని మేకర్స్ ఎనౌన్స్ చేసారు. ఈ రోజు సాయంత్రం ఆరింటి నుండి హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది.