ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటిటిలో అన్స్టాపబుల్ గా "పులి - మేక"

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 17, 2023, 01:41 PM

జీ 5 ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న "పులి - మేక" క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సస్పెన్స్ థ్రిల్లర్ కి డిజిటల్ ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. బ్లాక్ బస్టర్ ఓపెనింగ్ రెస్పాన్స్ అందుకున్న ఈ సిరీస్ ఈమధ్యనే100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ మార్క్ ను అందుకుని, జీ 5 ఓటిటిలో ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. తాజాగా పులి మేక జీ 5 ఓటిటిలో 120 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ని పూర్తి చేసుకుందని సదరు ఓటిటి సంస్థ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసింది.


'పంతం' ఫేమ్ కే చక్రవర్తి రెడ్డి దర్శకత్వంలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ వెబ్ సిరీస్ లో హీరో ఆది సాయికుమార్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రధానపాత్రల్లో నటించారు. సుమన్, సిరి హనుమంత్, అవినాష్ కీలకపాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ కు ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com